Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభDevarakonda the rapper: ర్యాపర్ గా దేవరకొండ

Devarakonda the rapper: ర్యాపర్ గా దేవరకొండ

ద దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ ఇలా ఉంటాయి

అదేంట్ దేవరకొండ ఎప్పుడు ర్యాపర్ అయ్యారు అనుకుంటున్నారా. మరి ద దేవరకొండ బ్రదర్స్ అంటే మల్టీ టాలెంటెడ్ గా. ఆల్రెడీ కామ్రేడ్ సినిమా కోసం లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ చేసిన అనుభవం ఉంది సీనియర్ దేవరకొండ అదేనండీ మన విజయ్ దేవరకొండ. ఇప్పుడు జూనియర్ దేవరకొండ అంటే ఆనంద్ దేవరకొండ కూడా తన సినిమా కోసం ర్యాపర్ గా మారారు.

- Advertisement -

ఈమేరకు ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. రిలీజ్ కు రెడీ అయిన గణేశాలో సర్వ శక్తులు ఒడ్డుతున్న ఆనంద్ సినిమా ప్రమోషన్ పై గత కొన్ని రోజులుగా చాలా కష్టపడుతూ, నిత్యం గం గం గణేశా టాక్ ఆఫ్ ది పబ్లిక్ గా ఉండేలా చాలా కేర్ తీసుకుంటూ మంచి బజ్ తెచ్చారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

ఈ రోజు “గం..గం..గణేశా” నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి ప్రణవ్ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా, ఒకడిది మాట దాటలేని బాట..గెలుపసలు ఎవడిదో..అంటూ కథలోని సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగింది. పర్పెక్ట్ లిరిక్స్, బీట్ తో “గం..గం..గణేశా” ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News