Devi Sri Prasad: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్‌ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి సన్నిహితం ఎంత గొప్పదో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గబ్బర్ సింగ్ చిత్రం నుంచి వీరి సన్నిహితం మరింత బలపడింది. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీ చేసిన ఓ పని ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
బర్త్ డే రోజే షాక్
అదే హరీష్ శంకర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపకపోవడం. ఈ రోజు మార్చి 31 హరీష్ శంకర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కానీ, దేవి శ్రీ నుంచి ఇంతవరకు విషెస్ రాలేదు. పైగా దేవి శ్రీ ఆయనను అన్‌ఫాలో చేయడం అందరికి షాకిచ్చింది. ఈ ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో మొత్తం దీనిపై చర్చ జరుగుతుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. హరీష్ శంకర్ బర్త్‌డే రోజే.. దేవి శ్రీ ఆయనను అన్‌ఫాలో చేయడం వారి అభిమానులను బాధిస్తోంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్‌కి మొదట సంగీత దర్శకుడిగా దేవి శ్రీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది..
కానీ, ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్‌లోకి థమన్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ షూటింగ్ అయిపోయి విడుదలకు సిద్దమౌతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉస్తాద్‌కు పాటలకు మాత్రమే దేవిశ్రీ సంగీతం అందిస్తారని, నేపథ్య సంగీతం మాత్రం ఎస్‌ఎస్ థమన్ అందిస్తారని మూవీ టీం పేర్కొంది. కాగా ఉస్తాద్‌ని అనుకున్న టైం కంటే ముందుగానే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మార్చి 19న విడుదల చేశారు. అందువల్ల ఈ సినిమాలోకి థమన్‌ని తీసుకురావాల్సి వచ్చిందని మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. దేవి శ్రీ ఇతర ప్రాజెక్ట్స్ బిజీగా ఉండటం వల్ల తమన్‌ని తీసుకువచ్చామని, తక్కువ టైంలో క్వాలిటీ BGM ఇవ్వడం సాధ్యం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే గతంలోనూ పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగిన సంగతి తెలిసిందే. మూవీ షూటింగ్ మధ్యలో దేవిశ్రీని పక్కన పెట్టి థమన్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Kathanar Trailer: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్స్

