Dhanush 55: కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్, వైవిధ్యమైన సినిమాలతో హీరోయిన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి కాంబోకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి మారి 2 సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలై ఏడేళ్లవుతుంది. సినిమా ఓకే అనిపించుకుంది. కానీ.. ఈ సినిమాలో ‘రౌడీ బేబి..’ సాంగ్ ఎంత బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్ ఇప్పటి వరకు 170 కోట్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. ట్యూన్‌కు అనుగుణంగా ధనుష్, సాయి పల్లవి వేసిన స్టెప్స్ ఆడియెన్స్‌ను అలరించాయి. తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు.
అయితే లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ధనుష్, సాయి పల్లవి కాంబోలో సినిమా రానుంది. వివరాల్లోకి వెళితే ధనుష్ ఇప్పుడు తన 54వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరో వైపు ఆయన 55వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. మేకర్స్ ఇప్పటికే కొంత మంది హీరోయిన్స్‌తో చర్చలు జరుపుతున్నారు. తాజాగా సాయి పల్లవితో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ చెన్నై సుందరి రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి రామాయణ. ఇందులో సీతగా కనిపించనుంది. మరో మూవీ మేరే రహో. ఈ రెండు సినిమాల్లో ఇప్పటికే రామాయణ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటోంది. కాబట్టి.. ధనుష్ మూవీలో ఈ విలక్షణ నటిని నటింప చేయటానికి సంబంధించిన చర్చలు జోరుగానే నడుస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వస్తుందని మూవీ వర్గాలంటున్నాయి.
Also Read – India-China : భారత్-చైనా సంబంధాల్లో మెరుగుదల: ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన!
సాయి పల్లవి కంటే ముందు పూజా హెగ్డే దాదాపు కన్‌ఫర్మ్ అనే టాక్ అయితే బలంగా వినిపించింది. ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. మరి ఇద్దరూ ధనుష్ మూవీలో ఉన్నారా? లేక ఒకరినే మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటారా? అనేది మాత్రం తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. శివ కార్తికేయన్‌తో అమరన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన రాజ్ కుమార్ పెరియసామి ధనుష్ 55 చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ప్రస్తుతం ధనుష్, ఆనంద్ ఎల్.రాయ్ కాంబోలో రూపొందిన తేరీ ఇష్క్ మే సినిమా నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఇందులో కృతిసనన్ కథానాయిక అనే సంగతి తెలిసిందే. మరో వైపు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఇప్పటికే తన 54వ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. ఈ మూవీ ఫ్రిబ్రవరిలో రిలీజ్ కి సన్నద్ధమవుతోంది.
COP-30 : పర్యావరణ పరిరక్షణ-వాణిజ్యం.. – 30లో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళన!

