Tuesday, February 17, 2026
Homeచిత్ర ప్రభDhanush: కొడుకుని హీరోగా లాంఛ్ చేసే ప్రయత్నాల్లో ధనుష్?

Dhanush: కొడుకుని హీరోగా లాంఛ్ చేసే ప్రయత్నాల్లో ధనుష్?

Dhanush: ధనుష్ ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంటుగానే ధనుష్ తన మేనల్లుడిని హీరోగా పెట్టి దర్శక, నిర్మాతగా మారి సినిమాని చేశాడు. జెన్ జీ బ్యాచ్‌కు నచ్చే, మెచ్చే స్టోరీతో ధనుష్ మెస్మరైజ్ చేశాడు. ఇక తన కొడుకు యాత్ర కోసం కూడా అలాంటి ఓ ట్రెండీ కథను సిద్దం చేస్తున్నాడట. తన కొడుకుని తెరకు పరిచయం చేసే పనుల్లో ధనుష్ బిజీగా ఉన్నాడు. తన ప్రొడక్షన్ కంపెనీ మీదే ధనుష్‌ను లాంచ్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక ఈ క్రమంలోనే ధనుష్ తన కొడుక్కి కెమెరా అలవాటు కావాలని బయటకు తీసుకు వస్తున్నాడట.

- Advertisement -

ధనుష్, ఐశ్వర్యలు భార్యాభర్తలుగా విడిపోయినా కూడా బిడ్డల కోసం మాత్రం అమ్మానాన్నల కర్తవ్యాన్ని విడిచి పెట్టడం లేదు. ఇక ధనుష్ అయితే తన కొడుకులు యాత్ర, లింగతో నిత్యం టచ్‌లోనే ఉంటాడు. పలు వేదికలు, ఈవెంట్లలో తండ్రీ, కొడుకులు కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. రీసెంటుగానే ఈ ముగ్గురూ కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొడుకు లాంచింగ్ కోసమే దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాడని అంతా అనుకుంటున్నారు.

Also Read – Shankar: ఎట్టకేలకు నిర్మాతను పట్టుకున్న శంకర్?.. ఇదైనా వర్కౌట్ అయ్యేనా

ధనుష్ ప్రస్తుతం తన కొడుకు డెబ్యూ మూవీ మీదే ఫోకస్ పెట్టాడని కోలీవుడ్ చెబుతోంది. ఇప్పటికే ధనుష్ తన లైనప్స్‌ను పక్కన పెట్టాడని సమాచారం. చివరగా ఇడ్లీ కడై అంటూ ఆడియెన్స్ ముందుకు ధనుష్ వచ్చాడు. ఆ చిత్రం కమర్షియల్‌గా అంతగా ఆడకపోయినా కూడా నటుడిగా ధనుష్‌కు మంచి పేరుని తీసుకు వచ్చింది. ఇక ఇప్పుడు ధనుష్ మళ్లీ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాల్ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

ధనుష్ ప్రస్తుతం ఓ రూమర్‌తో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. మృణాళ్‌తో ధనుష్ డేటింగ్‌లో ఉన్నాడని, ప్రేమలో ఉన్నారని రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఇక కొందరు అయితే ఏకంగా వీరికి పెళ్లి అయింది అన్నట్టుగా ఏఐ ఫోటోల్ని కూడా క్రియేట్ చేశారు. మరి ఈ రూమర్లకు ధనుష్ పుల్ స్టాప్ ఎప్పుడు పెడతాడో చూడాలి.

Also Read – Vikram K Kumar Story: నితిన్ కోసం రాసుకున్న కథలో విజయ్ దేవరకొండ?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News