Dhanush Kara Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా సుపరిచితం. ఇప్పటికే సార్, కుబేర చిత్రాలతో నేరుగా తెలుగు ఆడియన్స్‌ని పలకరించాడు. దీంతో టాలీవుడ్‌లో ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ధనుష్ చిత్రాలంటూ తెలుగు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దర్శకుడిగా, నటుడుగా వరుస సక్సెస్‌తో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం కర.
ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 30న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కర ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ధనుష్, మమితా బైజు ఒక మధ్యతరగతి భార్యాభర్తలుగా చాలా సహజంగా కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ పతాకాలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో డా. ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించగా సంచలన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలోనే సినిమా ప్రమోషన్లను కూడా ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ధనుష్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ‘కర’ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

