Dhanush – Nagarjuna: ధనుష్ హీరోగా నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లనే సినిమా రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.66 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించాలి. తొలి మూడు రోజుల్లోనే కుబేర సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అంటే షేర్ వసూళ్లను చూస్తే అవి రూ. 40.45కోట్లు. అంటే ఇంకా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.26 కోట్ల మేరకు వసూళ్లు రావాలి.
తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ నాటికి కుబేర కలెక్షన్స్ …
నైజాం: 9.20 కోట్లు
సీడెడ్ : 2.76 లక్షలు
ఉత్తరాంధ్ర : 3.31 కోట్లు
ఈస్ట్ : 1.64 కోట్లు
వెస్ట్ : 1.11 కోట్లు
గుంటూరు : 1.49 కోట్లు
గుంటూరు : 1.51 కోట్లు
నెల్లూరు : 79 లక్షలు
అంటే తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకుగానూ రూ. 21.81 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. (గ్రాస్ ప్రకారం చూస్తే రూ. 37.45 కోట్లు), రావాల్సిన కలెక్షన్స్‌లో ఇప్పటి వరకు 64 శాతం వచ్చాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..మొత్తంగా రూ.80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాగా.. షేర్ వసూళ్ల ప్రకారం చూస్తే ఆ లెక్క రూ. 40.45కోట్లు.
తెలుగు రాష్ట్రాల్లో – రూ. 37.45 కోట్లు
తమిళనాడు – రూ. 13.45 కోట్లు
కర్ణాటక – రూ. 6.18 కోట్లు
కేరళ – రూ. 73 లక్షలు
హిందీ, రెస్టాఫ్ ఇండియా – రూ 1.40 కోట్లు
ఓవర్సీస్ – రూ. 20.85 కోట్లు
వరల్డ్ వైడ్‌గా గమనిస్తే ఇప్పటి వరకు 61 శాతమే రికవరీ అయ్యింది. మరీ ఈ వారం సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా సాధిస్తుందనేది చూడాలి. అయితే వారాంతాల్లో వచ్చే కలెక్షన్స్.. మిగతా రోజుల్లో ఉండదు. మరి రావాల్సిన రూ.20 కోట్లు షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు. నాలుగేళ్ల తర్వాత శేఖర్ కమ్ముల చాలా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.