Homeచిత్ర ప్రభMovie: ‘ధరణి ఐ లవ్ యు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్

Movie: ‘ధరణి ఐ లవ్ యు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్

Poster Release : వంశీ, మహిత హీరోహీరోయిన్లుగా సాయికృష్ణ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధరణి ఐ లవ్ యు’. బాలామణి సమర్పణలో రాజశేఖర్ మద్దికుంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత ఎస్‌కేఎన్ ఆవిష్కరించారు.టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ కలుగుతోందన్నారు. దర్శకుడు సాయికృష్ణ కె.వి. గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రానికి అసోసియేట్‌గా పనిచేశారని తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఎస్‌కేఎన్ చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఆయన ఇండస్ట్రీలో మంచి టైమింగ్ ఉన్న నిర్మాత. ‘బేబీ’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ మా పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నామని చిత్రబృందం తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

ఈ చిత్రానికి కామన వి. సాయి, బాలసూర్య మాటలు అందించారు. ఉమా వంగూరి, చాందిని, విశ్వనాథ్ కారసాల పాటలు రచించారు. పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నందమూరి హరి, ఎన్.టి.ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నయోగి అన్నెం సినిమాటోగ్రఫీ, జగన్.బి ఆర్ట్, దేవరాజ్, నందు, జీవన్ ఫైట్స్, చంద్రకిరణ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News