Tuesday, September 10, 2024
Homeచిత్ర ప్రభDhoom Dham to release tomorrow: రేపే ధూంధాం రిలీజ్

Dhoom Dham to release tomorrow: రేపే ధూంధాం రిలీజ్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ నెల 7న రిలీజ్ కానున్న “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ లిరికల్ సాంగ్

- Advertisement -

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ జోష్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’, ‘టమాటో బుగ్గల పిల్ల..’ పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. సినిమా మ్యూజికల్ సూపర్ హిట్ అవుతుందనే క్రేజ్ ను ఈ సాంగ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జోరును కొనసాగిస్తూ “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ లిరికల్ సాంగ్ ను ఈ నెల 7వ తేదీన ఉదయం 10.45 నిమిషాలకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేయబోతున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ చేస్తున్న “ధూం ధాం” సినిమా ఆల్బమ్ లో ‘కుందనాల బొమ్మ..’ మరో హిట్ సాంగ్ కాబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News