Pawan Kalyan Harish Shankar Movie: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన పెండింగ్‌లో ఉన్న చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన పెండింగ్‌లోని తన సినిమాలను పూర్తి చేయటంపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ‘హరి హర వీర మల్లు’, ‘OG’ చిత్రాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్, ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జూలై చివరి నాటికి పూర్తవుతుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ‘తెరి’ సినిమాను బేస్ చేసుకుని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ కోసం ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ రిలీజయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read – Lucky Moles: అక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయా.? అదృష్టానికి కేరాఫ్ అడ్రస్
ఈ క్రమంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర యూనిట్ మెగా అభిమానుల కోసం ఓ స్పెషల్ ట్రీట్‌ను సిద్ధం చేస్తోంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఒక డైలాగ్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అభిమానులకు దొరికే బహుమతిగా చెప్పొచ్చు. ఇందులో పవన్‌కు జోడీగా శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ముందుగా రిలీజయ్యేది హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). జూలై 24న పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ రిలీజైన రెండు నెలల్లోనే ఓజీ మూవీ రానుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Also Read – Divorce Case: భర్తతో శృంగారం చేయకపోతే విడాకులు ఇవ్వొచ్చు: బొంబాయి హైకోర్టు


