Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభDacoit: రజినీకాంత్ వల్లే శ్రుతి ఆ సినిమా వదిలేసిందా..?

Dacoit: రజినీకాంత్ వల్లే శ్రుతి ఆ సినిమా వదిలేసిందా..?

Dacoit Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడివి శేష్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి మిగతా హీరోలలా కాకుండా పూర్తిగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. శేష్‌కి నటన మీదే కాదు, స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్‌లోనూ మంచి పట్టుంది. ఇటీవల నాని నటించిన హిట్ 3లో క్లైమాక్స్ సీన్‌లో ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

- Advertisement -

ప్రస్తుతం శేష్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ చిత్రాలే గూఢచారి 2, డకాయిట్. ఈ రెండు చిత్రాల మీద ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న డకాయిట్ శేష్ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అంటున్నారు.

డకాయిట్ మూవీకి షానియల్‌ డియో దర్శకుడు. కింగ్ నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో.. ఎస్ ఎస్ క్రియేషన్స్ అలాగే, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇప్పటికే తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.

మృణాల్ కి ముందు ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో మృణాల్ వచ్చి చేరింది. దీంతో ఆమధ్య నెట్టింట కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. వీటికి శేష్ క్లారిటీ ఇచ్చారు. ఆమె తప్పుకోవడంలో ఎలాంటి డ్రామా లేదని కన్‌ఫర్మ్ చేశారు. వర్కింగ్ స్టైల్ లో కొన్ని డిఫరెన్సెస్ రావడం అలాగే, కూలీ మూవీ షెడ్యూల్స్ తో డేట్స్ సర్దుబాటు కాకనే శ్రుతి తప్పుకున్నారని చెప్పారు. ఇక ఈ సినిమా దాదాపు 60 శాతం పూర్తైందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News