Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు దిల్ రాజు. ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు దిల్ రాజు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.
దిల్ రాజు భార్య అనిత 2017 లో చనిపోయారు. అనంతరం కరోనా సమయంలో 2020లో తేజస్విని రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇటీవలే ఒక బాబు కూడా పుట్టాడు. తాజాగా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి మాట్లాడాడు.
దిల్ రాజు తన రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ”నా భార్య అనిత మరణించాక నేను రెండేళ్ల వరకు మెంటల్లీ స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. ఆ టైంలో నా కూతురు, అల్లుడు కూడా నాతోనే ఉండేవారు. నా భార్య చనిపోయిందని బాధ నుంచి బయటకి రావడానికి చాలా ట్రై చేశాను కానీ కుదర్లేదు. నాకున్న వ్యాపకాలన్నిటి మీద దృష్టి పెట్టాను. నన్ను మా పేరెంట్స్ అలా చూస్తూ ఉండలేక రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా రెండో పెళ్లి చేసుకోమంది. మా పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో అన్ని రకాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నాను” అని తెలిపారు.