Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభTollywood: దిల్ రాజు అలా.. అల్లు అరవింద్ ఇలా.. సంక్రాంతికి వార్ తప్పదా?

Tollywood: దిల్ రాజు అలా.. అల్లు అరవింద్ ఇలా.. సంక్రాంతికి వార్ తప్పదా?

- Advertisement -

Tollywood: ఒక సినిమాని తెరకెక్కించడం ఎంత కష్టమో.. ఆ సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసుకోవడం కూడా అంతే కష్టమైపోయింది ఈరోజుల్లో. దాదాపుగా మేకర్స్ అంతా పండగలు, వరస సెలవుల సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని చూస్తారు. ఓటీటీలు, పైరసీల పుణ్యమా అని ఎంత పెద్ద సినిమా అయినా లాంగ్ రన్ కి కష్టమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ ఎంత భారీగా ఉంటే సినిమా అంత పెద్ద హిట్.

అందుకే మేకర్స్ అంతా ఒకేసారి ఫెస్టివల్ సీజన్ లోనే తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పండుగలలో పెద్ద పండగగా చెప్పుకొనే సంక్రాంతి వస్తుందంటే బడా హీరోలంతా థియేటర్ల మీద దండయాత్రకి సిద్ధమయ్యే సంగతి తెలిసిందే. రాబోయే సంక్రాంతి మీద కూడా మేకర్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ ల విషయంలో ఈ సారి కన్ఫ్యూజన్ నెలకొంది.

నిజానికి కొంత కాలంగా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో పాటు మరికొందరు సినీ పెద్దలు సినిమాల రిలీజ్ విషయంలో చర్చలు, సంప్రదింపులు జరిపి ఎవరికి నష్టం కలగకుండా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇండస్ట్రీలో ఈసారి సంక్రాంతికి ఎలా ఉండబోతోందనే గట్టి చర్చ నడుస్తుంది. దీనికి కారణం బడా ప్రొడ్యూసర్లు దిల్ రాజు.. అల్లు అరవింద్ రెండు దారులుగా కామెంట్స్ చేయడమే.

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ సినిమా రిలీజ్ కి సంబంధించి.. ముందుగా మన తెలుగు సినిమాల విడుదలకి ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజు కామెంట్స్ చేశారు. దిల్ రాజు కామెంట్స్ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ నుండి కూడా అదే మాదిరి ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే.. ఈ విషయంపై అల్లు అరవింద్ మాత్రం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఇండియా సినిమా ఒక్కటవగా కేవలం తెలుగు సినిమాలకే ప్రాధాన్యత సాధ్యమయ్యే పని కాకపోవచ్చని చెప్పారు. దీంతో ఈసారి సంక్రాంతికి రిలీజ్ వార్ తప్పదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News