Yellamma Movie: జబర్దస్త్ షోతో అలాగే సినిమాలలో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న వేణు.. బలగం అనే సినిమాను తీస్తాడని ఏ ఒక్కరూ ఊహించలేదు. పైగా ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఓ సృజనాత్మకమైన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడని సినీ ప్రముఖులందరూ మెచ్చుకున్నారు. అగ్ర దర్శకుల నుంచి పెద్ద నిర్మాతల వరకూ వేణుని ప్రశంసించనివారు లేరు. అలాంటి, సినిమా బలగం. అతి తక్కువ బడ్జెట్‌తో మంచి వసూళ్ళు రాబట్టింది.
అవార్డులు దక్కించుకుంది. దీంతో, వేణుకి దర్శకుడిగా మంచి ఆఫర్స్ వచ్చాయి. వీటిలో ఓ సినిమానే ఎల్లమ్మ అనే టైటిల్‌తో రూపొందబోతున్న సినిమా. బలగం సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు వేణుకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. కథపై బాగా కసరత్తు చేసి సెట్స్‌పైకి తీసుకురావాలనుకున్నాడు. కానీ, ఏడాది నుంచి ఈ సినిమాకి సంబందించిన వార్తలు రక రకాలుగా వచ్చి హాట్ టాపిక్ అయింది. ముందు ఇందులో హీరోగా నాని అనుకున్నారు.
Also Read – The Raja Saab: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘ది రాజా సాబ్’ దూకుడు.. నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి!
నాని మారిపోయి, ఆ ప్లేస్‌లో నితిన్ వచ్చాడు. కానీ, దిల్ రాజు సినిమాలు ఫ్లాపై ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఎల్లమ్మ సెట్స్‌పైకి వచ్చే విషయంలో బాగా జాప్యం జరిగింది. ఒకదశలో ఈ సినిమా ఇక ఉండదనే మాట కూడా వినిపించింది. అయితే, తాజాగా దర్శకుడు వేణు అప్‌డేట్ ఇచ్చాడు. ఓ వీడియో ద్వారా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, జనవరి 15న అఫీషియల్‌గా ఈ మూవీలో నటించే నటీనటులతో సహా ఇతర విషయాలను వెల్లడించనున్నట్టుగా తెలిపాడు.
అది కూడా గ్లింప్స్ ద్వారా వెల్లడించనున్నట్టు ప్రకటించాడు వేణు. ఇక, గతకొన్ని రోజుల నుంచి ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే, కీర్తి సురేష్ కన్‌ఫర్మ్ అయింది. కానీ, ఆ మధ్య ఇందులో తాను లేనన్నట్టుగా కీర్తి క్లారిటీ ఇచ్చింది. మరి, జనవరి 15న విడుదల చేయబోతున్న ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ లో హీరోహీరోయిన్స్ ఎవరనేది వెల్లడి కానుంది. అలాగే, షూటింగ్ డీటైల్స్ కూడా తెలియనున్నాయి. ఇక ఈ మూవీ దిల్ రాజు సంస్థలో నిర్మించబోతున్న 61వ సినిమా.
Also Read – The Rajasaab: రాజాసాబ్ లోతు అర్థం చేసుకోలేకపోతున్నారు.. మారుతి ఫీలవుతున్నారు!

