Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభDil Raju: చిత్ర పరిశ్రమపై కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్

Dil Raju: చిత్ర పరిశ్రమపై కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్

సినిమా పరిశ్రమ గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(TFDC) ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో జరిగిన సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు. అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్రపరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు.

హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని సినిమా ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad