Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభDil Raju: హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో దిల్ రాజు భేటీ

Dil Raju: హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో దిల్ రాజు భేటీ

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(TFDC) చైర్మన్, నిర్మాత దిల్ రాజు(Dil Raju) తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో సమావేశమయ్యారు. సినిమా పరిశ్రమలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. అలాగే థియేటర్ల లైసెన్స్‌ల గడువు సులభంగా ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు ఈ భేటీకి హాజరయ్యారు.

- Advertisement -

కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో సినిమా పరిశ్రమ ప్రముఖుల భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు దిల్‌ రాజు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజ్ చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన హోంశాఖ మంత్రి కార్యదర్శితో సమావేశం కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News