పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ అధికారుల సోదాల(IT Raids)పై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(TGFDC) ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద కొనసాగుతున్నాయని చెప్పారు. కేవలం తమ సంస్థ మీద, తన మీద మాత్రమే ఈ తనిఖీలు జరుగుతున్నట్టు మీడియాలో కథనాలు ప్రసారం చేయడం తగదని తెలిపారు.
కాగా మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసాలు, కార్యాలయంతో పాటు మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.