Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభTejaswini: దిల్ రాజు ఎవ‌రో నాకు తెలియ‌దు.. షాకింగ్ సీక్రెట్ చెప్పిన భార్య తేజ‌స్విని

Tejaswini: దిల్ రాజు ఎవ‌రో నాకు తెలియ‌దు.. షాకింగ్ సీక్రెట్ చెప్పిన భార్య తేజ‌స్విని

Producer Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు అరుదుగా ఉంటార‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీ లీడింగ్ ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ఎగ్జిబిట‌ర్స్‌లో ఆయ‌న ఒక‌రు. అయితే ఆయ‌న స‌తీమ‌ణి తేజస్విని (Dil Raju Wife) రీసెంట్ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు గురించి చెప్పిన మాట‌లు ఇప్పుడు సోషల్ మీడియాలోతెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తేజస్విని, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, దిల్ రాజుతో తన జర్నీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. దిల్ రాజు తన మొదటి భార్య అనిత (Dil Raju First Wife) మరణానంతరం తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

తేజస్విని చెప్పిన విషయాలు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ‘‘నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి అస్సలు తెలియదు. దిల్ రాజుతో పరిచయం ఏర్పడినప్పుడు, ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. డైరెక్టర్ అనుకున్నా, తర్వాత గూగుల్ చేస్తే ప్రొడ్యూసర్ అని తెలిసింది!’’ అంటూ ఆమె ఓపెన్ అయ్యారు. ‘‘దిల్ రాజు గారికి పెళ్లయిందని తెలిశాక, ఈ రిలేషన్ షిప్ వద్దు అనుకున్నా’ అని అయితే, జీవితంలో ముందుకు వెళ్ళడానికి నిజాయితీ ఉన్న వ్యక్తి కావాలని భావించి, మళ్ళీ దిల్ రాజుతో జర్నీ ప్రారంభించానని తేజస్విని తెలిపారు. దిల్ రాజు గురించి తేజస్విని ఓపెన్‌గా చేసిన కామెంట్స్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/jr-ntr-preparing-for-his-next-movie-with-trivikram/

తేజ‌స్వినితో దిల్ రాజు పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన‌ప్పుడు ఆమె పెళ్లి విషయంలో చివరి నిర్ణయం తనను పెంచిన మావయ్య, పిన్నిలదేనని తేజస్విని చెప్పిన‌ప్పుడు.. దిల్ రాజు ‘ఎవర్ని ఒప్పించాలి?’ అని అడిగితే తన పెద్ద మామయ్య గురించి తేజస్విని చెప్పింది. తన పెద్ద మామయ్య హిట్లర్ లాంటి వ్యక్తి అని, ఈ పెళ్లికి అంగీకరించడేమో అని అనుకుంటే. ఊహించని విధంగా, ఆయనే ముందుగా పెళ్ళికి అంగీకరించాడని అది తనకెంతో ఆశ్చర్యకరంగా అనిపించిందని తేజస్విని తెలియజేసింది. తొలుత ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా, చివరికి అందరినీ ఒప్పించి దిల్ రాజు, తేజస్విని వివాహం చేసుకున్నారు. వీరి స్వీట్ అండ్ షాకింగ్ ప్రేమకథ ఇప్పుడు అందరి నోటా నానుతోంది. ఇది నిజంగా సినిమా స్టోరీని తలపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News