Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభNagarjuna: 100వ సినిమాకు దర్శకుడు ఫిక్సైయ్యాడా..?

Nagarjuna: 100వ సినిమాకు దర్శకుడు ఫిక్సైయ్యాడా..?

Nagarjuna 100th Film: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున కథ నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా వెనకాడరు. అందుకే, ధనుష్ హీరో అయినా, శేఖర్ కమ్ముల దర్శకుడైనా కుబేర సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున మరో సినిమాతోనూ రాబోతున్నారు.

- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీలోనూ నాగ్ కీలక పాత్రను పోషించారు. ఇందులో ఆయన నెగిటివ్ రోల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక జైలర్, వేట్టయాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రజినీ.. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాగార్జున 100వ సినిమా గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి.

నాగార్జున నటించబోయో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నారట. అంతేకాదు, ఈ ఆగస్టు నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ కే.. నాగ్ 100వ సినిమాకి దర్శకుడిగా ఎంపికైనట్టు సమాచారం. గతంలో నాగార్జున నటించిన మాస్ లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కలిసి ఉండేలా కథ సిద్ధం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ కథ బాగా నచ్చే నా సామిరంగా తర్వాత సోలో హీరోగా నాగ్ మరో చిత్రాన్ని ఒప్పుకోలేదని ఇన్‌సైడ్ టాక్. ఇక నాగార్జునకి మన్మథుడు, మాస్, కింగ్, తాజాగా కుబేర వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారట. ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఇప్పటికే నాగార్జున 100 చిత్రాలను ఎప్పుడో పూర్తి చేశారు. కానీ, ఆయన హీరోగా చేసిన సినిమాలు 99. ఇప్పుడు మొదలవబోతున్న వందవ సినిమాకి కింగ్ 100 అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News