Friday, January 16, 2026
Homeచిత్ర ప్రభGeetu Mohandas: వాటిని చూసి చిల్ అవుతున్నాను.. విమర్శలపై గీతూ మోహన్ దాస్ కౌంటర్

Geetu Mohandas: వాటిని చూసి చిల్ అవుతున్నాను.. విమర్శలపై గీతూ మోహన్ దాస్ కౌంటర్

Geetu Mohandas: యశ్ నటించిన ‘టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, క్యారెక్టర్ పోస్టర్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక యశ్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ అయితే దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసింది. యశ్‌ని ఇది వరకెన్నడూ చూపించని రీతిలో గీతూ మోహన్ దాస్ చూపించారు. యాక్షన్, రొమాన్స్ ఇలా ప్రతీ అంశంలో యశ్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే గ్లింప్స్‌లోనే ఈ రేంజ్ రొమాన్స్ ఉందేంటి? అది కూడా లేడీ డైరెక్టర్ ఇలాంటి సీన్లను షూట్ చేశారా? అని అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు.

- Advertisement -

టాక్సిక్ గ్లింప్స్‌ మీద వస్తున్న ట్రోలింగ్.. లేడీ డైరెక్టర్ ఇలాంటి సీన్లు తీయడం ఏంటి? అనే విమర్శలపై గీతూ అదిరిపోయేలా కౌంటర్ వేశారు. అలాంటి విమర్శల్ని చూసి నేను చిల్ అవుతున్నాను అని సింపుల్‌గా సెటైర్‌లు వేసింది. గ్లింప్స్‌లో శ్మశానం వద్ద కారులో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు చూపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్‌లో నటించిన ఫారిన్ నటిని కూడా దర్శకురాలు పరిచయం చేసింది. ఆమె పేరు బిట్రీజ్ బాఖ్ అని పేర్కొన్నారు. ఈ హాలీవుడ్ నటి బ్రూక్లిన్ నైన్ నైన్‌తో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించి మెప్పించారు.

Also Read – Pawan Kalyan: మతాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించొద్దు.. పోలీసులకు డిప్యూటీ సీఎం సూచన

ఇక టాక్సిక్ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాకీ భాయ్‌గా యశ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేజీయఫ్‌తో యశ్ బాక్సాఫీస్ వద్ద సునామీని క్రియేట్ చేశాడు. చాప్టర్ 1 దాదాపు మూడు, నాలుగు వందల కోట్లు కొల్లగొడితే.. ఛాప్టర్ 2 ఏకంగా వెయ్యి కోట్ల మార్క్‌ని దాటేసింది. అలా రాకీ భాయ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది. అయితే కేజీయఫ్ తరువాత ఆచి తూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఇంత ఆలస్యం జరిగింది.

ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్’ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. రామాయణ మూవీ కూడా త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది. అయితే రామాయణ మూవీలో రావణుడిగా యశ్ నటించడమే కాకుండా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. మరి ఈ రెండు చిత్రాలతో యశ్ భవిష్యత్తు, రేంజ్ ఎలా మారుతుందో చూడాలి.

Also Read – WPL 2026: ముంబయి vs ఢిల్లీ.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన హర్మన్‌ సేన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News