ఐదేళ్లుగా ఈ సినిమాపై వస్తున్న “రాదు, ఆగిపోయింది” అంటూ కొందరు నిరంతరం “నెగిటివ్ కక్కుతూనే ఉన్నారు”. వాళ్ళందరికీ ఈ ప్రకటన ఓ దిమ్మతిరిగే సమాధానం. రెండు పాండమిక్‌లు, ఆ తర్వాత ఎలక్షన్‌లు వంటి పెద్ద అడ్డంకులు ఎదురైనా, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎంగా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచినా, ఆ నెగిటివిటీ ఆగలేదు. కానీ, చిత్ర యూనిట్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ‘‘మేము మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటానే ఉన్నాం’’. ఎందుకంటే, ఇది వాళ్ళు రాసే పిచ్చిరాతలు లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవడానికి ఇది ఒక చిన్న గుడిసె కాదు ఇది ఒక కంచుకోట. అవును, పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు. సినిమా బడ్జెట్ ఎక్కువైందని ఆందోళన పడిన వారికి, మన పవన్ సార్ ఇమేజ్ కి ఎంత చేసినా తక్కువే అని డైరెక్టర్ జ్యోతి కృష్ణ స్పష్టం చేశారు.
‘‘పవన్ సార్ గతంలో ‘ఖుషి’తో అప్పట్లో హైయెస్ట్ కలెక్షన్ రికార్డు, ‘గబ్బర్ సింగ్’తో తెలుగులో మొదటి 100 కోట్లు వసూలు చేసిన సినిమా అందించారు. ఇప్పుడు HHVM 100 శాతం స్ట్రైక్ రేట్‌తో కొట్టబోతున్నాం’’ అని యూనిట్ పూర్తి నమ్మకంతో ఉంది. క్రిష్ గారి పక్కా గ్రౌండ్ ప్లాన్, త్రివిక్రమ్ గారి అమూల్యమైన సపోర్ట్‌తో ‘మంచి ప్రొడక్ట్’, ‘మంచి సినిమా అందించాలనే’ ఉద్దేశ్యంతోనే ఈ ఆలస్యం జరిగింది. ఈసారి డేట్ మారదు, ‘ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతాయి. ఆంధి వస్తోంది, సిద్ధంగా ఉండండని జ్యోతికృష్ణ పేర్కొన్నారు. ఇదే వేదికపై మాట్లాడిన నిర్మాత రత్నం.. గతంలో ‘జీన్స్, భారతీయుడు, బాయ్స్, ఒకే ఒక్కడు’ లాంటి ఓవర్ బడ్జెట్ చిత్రాలతోనే ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్నారు, అవి బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా అదే కోవలో ఉండబోతుందన్నారు.