Saturday, February 14, 2026
Homeచిత్ర ప్రభVaranasi: వార‌ణాసి సీక్వెల్‌పై జ‌క్క‌న్న యూట‌ర్న్ - ర‌న్‌టైమ్ రివీల్

Varanasi: వార‌ణాసి సీక్వెల్‌పై జ‌క్క‌న్న యూట‌ర్న్ – ర‌న్‌టైమ్ రివీల్

Varanasi: మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వార‌ణాసితో ఫ‌స్ట్ టైమ్ వీరిద్ద‌రి క‌ల‌యిక కుదిరింది. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకొని చ‌రిత్ర‌ను సృష్టించిన త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌స్తోన్న ఈ సినిమా కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌తో ఈ సినిమా మేకింగ్ ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇస్తున్నారు. గ్లోబ్‌ ట్రాట‌ర్ ఈవెంట్ ద్వారా మ‌హేష్‌బాబు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు రాజ‌మౌళి. ఈ సినిమా టైమ్ ట్రావెల్‌, మైథాల‌జీ, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ అంశాల‌తో తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

- Advertisement -

కాగా వార‌ణాసి రెండు పార్ట్‌లుగా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై ఓ హాలీవుడ్ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చారు. వార‌ణాసికి సీక్వెల్ లేద‌ని అన్నారు. “రెండో పార్ట్ ఐడియా వ‌చ్చింది. కానీ చాలా ఆలోచించిన త‌ర్వాతే సింగిల్ పార్ట్‌గానే ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యాం. మూడు గంట‌ల ర‌న్‌టైమ్‌తో వార‌ణాసి ఉంటుంది అని రాజ‌మౌళి అన్నారు. ఆడియెన్స్ బోర్‌గా ఫీల‌య్యే సీన్‌ ఒక్క‌టి లేకుండా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని” రాజ‌మౌళి చెప్పారు.

Also Read – Krithi Shetty: కృతిశెట్టిని హీరోయిన్‌గా వ‌ద్ద‌న్న డైరెక్ట‌ర్ – అత‌డినే ప‌క్క‌న‌పెట్టిన ప్రొడ్యూస‌ర్‌

మ‌హేష్‌బాబుతో 2010లోనే సినిమా చేయాల్సింద‌ని, త‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఆల‌స్య‌మైంద‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. “ప‌దిహేనేళ్ల‌ క్రిత‌మే మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయాల‌నుకున్నా. కానీ అప్ప‌టికే నేను ఈగ‌, బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ క‌మిట‌య్యా. అనుకున్న టైమ్‌లో ఆ సినిమాలు కంప్లీట్ కాలేదు. అందుకే మ‌హేష్‌బాబుతో సినిమా ఆల‌స్య‌మైంది” అని రాజ‌మౌళి తెలిపారు.

ఈ సినిమాలో రామాయ‌ణం పార్ట్‌పై కూడా రాజ‌మౌళి రియాక్ట్ అయ్యారు. ఇందులో రామాయ‌ణం ఎపిసోడ్ 25 నుంచి 30 నిమిషాల వ‌ర‌కు ఉంటుంద‌ని అన్నారు. “రామాయ‌ణం, మ‌హాభార‌తాల నుంచి స్ఫూర్తి పొందే నా సినిమాల క‌థ‌లు ఉంటాయి. వార‌ణాసిలో మాత్రం రామాయ‌ణాన్ని చూపించే అవ‌కాశం దొరికింది” అని రాజ‌మౌళి అన్నారు.

వార‌ణాసి మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

Also Read – Manchu Mohan Babu: కిడ్నాప్ కాంట్ర‌వ‌ర్సీలో మంచు మోహ‌న్‌బాబు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News