Ram Gopal Varma: సినిమాల కంటే గత కొన్నాళ్లుగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన ఏం చేసిన, ఏం మాట్లాడిన కాంట్రవర్సీనే అవుతుంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తెర వెనుక ఉంటూ వచ్చిన ఆర్‌జీవీ ఫస్ట్ కెమెరా ముందుకు రాబోతున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఆర్‌జీవీ హీరోగా నటిస్తున్న డెబ్యూ మూవీకి షో మ్యాన్ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో నూతన డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
షో మ్యాన్ మూవీలో రామ్‌గోపాల్ వర్మ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పొడవైన గడ్డం, హెయిర్ స్టైల్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో రామ్ గోపాల్ వర్మ కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – Jatadhara OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన సుధీర్‌బాబు హారర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఆర్‌జీవీకి అచ్చొచ్చిన గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లోనే షో మ్యాన్ మూవీ తెరకెక్కుతోంది. షో మ్యాన్ పోస్టర్స్ చూస్తుంటే ఆర్‌జీవీ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షో మ్యాన్ షూటింగ్‌ను మొదలుపెట్టారట. సంక్రాంతికి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షో మ్యాన్ మూవీలో సీనియర్ హీరో సుమన్ విలన్‌గా నటిస్తున్నాడు.
ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మే భూత్ హై సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కథాంశంతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్‌జీవీ చేస్తున్న సినిమా ఇది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ హారర్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో పోలీస్ స్టేషన్ మే భూత్ హై ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్‌గోపాల్ వర్మ. ఆర్‌జీవీ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. గత కొన్నేళ్లుగా ఆర్‌జీవీ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. 2016లో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ తర్వాత ఆర్‌జీవీకి సరైన విజయాలు లేవు.
Also Read – Charan-Sukumar: చరణ్-సుకుమార్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్!

