Dhurandhar2: ‘ధురంధర్’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ కంటే అక్షయ్ ఖన్నా ఎక్కువగా వైరల్ అయ్యాడు. సారా అర్జున్‌కి సైతం ఈ మూవీతో మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీ దాదాపు అన్ని చిత్రాల రికార్డుల్ని బద్దలు కొట్టేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ రికార్డులు నమోదు చేసింది. ఇంత వరకు బాహుబలి, పుష్ప 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల మీదున్న రికార్డుల్ని ఈ మూవీ చెరిపేసింది.
ఇక ‘ధురంధర్’తో పాటుగా రెండో పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ కూడా మేకర్లు ఎప్పుడో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ ఈ రేంజ్‌లో హిట్ అవ్వడంతో చిన్న పాటి మార్పులు చేర్పులు చేశారట అంతే. ఇక ఈ మూవీని మార్చి 19న విడుదల చేసేందుకు టీం సిద్దంగా ఉంది. ఈ ‘ధురంధర్ 2’ మీద తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కాందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో జరిగిన రహస్య నిఘా కార్యకలాపాల చుట్టూ ‘ధురంధర్’ కథ తిరిగింది.
సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమా మొదటి భాగాన్ని ఇంతకుముందే సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ తెగ ప్రశంసించాడు. ఇక ఇప్పుడు పార్ట్ 2 మీద తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ‘ధురందర్ 2’ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ అవుతుంది, ఎందుకంటే మొదటి సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మనస్సులో వాటి విలువ, ప్రభావం పరంగా చాలా పెద్దదిగా మారింది. అదే నిజమైన స్టార్‌డమ్ గురించి అని ఆయన రాసుకొచ్చారు.
‘మొదటి భాగంలో పాత్రలు చిన్నవిగా లేదా పెద్దవిగా ఉండేవి, కానీ ఇప్పుడు వారందరూ దిగ్గజ సూపర్ స్టార్‌లుగా మారారు. అందువల్ల ధురంధర్ 2 ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుంది’ అని వర్మ ట్వీట్ వేశారు. ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండవ భాగం మార్చి 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read- Raai Laxmi : క్వీన్ లుక్‌తో కుర్రకారు ఫిదా.. రాయ్ లక్ష్మీ లేటెస్ట్ అవతార్.!

