Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Ram Gopal Varma: పోలీసుల విచారణకు రామ్‌గోపాల్‌ వర్మ డుమ్మా

Ram Gopal Varma: పోలీసుల విచారణకు రామ్‌గోపాల్‌ వర్మ డుమ్మా

RGV| ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసుల విచారణకు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు సమయం కావాలంటూ వాట్సప్ ద్వారా పోలీసులకు మెసేజ్ పెట్టారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని కోరారు. దీంతో పోలీసులు కూడా ఆర్జీవీ షూటింగ్‌లో ఉన్నారా.. లేదా అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -

తనపై మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆర్జీవీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ఆయన విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్‌లో నోటీసులు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad