Viral girl Monalisa: మహాకుంభమేళ గర్ల్ మోనాలిసా భోంస్లే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుంభమేళలో పూసలు అమ్ముకునే ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తన తేనె కళ్లతో అందరిని ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె మూవీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇంటికి వెతుక్కుంటు వెళ్లి మరి సినిమాకు అగ్రీమెంట్ చేసుకున్నాడు.
మోనాలిసా సంచలన వ్యాఖ్యలు
ఆ వెంటనే షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టాడు. తన సినిమా కోసం మోనాలిసాను పూర్తిగా మేకోవర్ చేశాడు. అయితే, తనకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సనోజ్ మిశ్రా మంచివాడు కాదని, షూటింగ్ పేరుతో తన శరీరాన్ని అసభ్యంగా తాకేవాడంటూ వాపోయింది. ఈ విషయాన్ని తన పేరెంట్స్‌కి చెబితే ఫస్ట్ మూవీ సర్దుకుపో అని చెప్పారని, తన కష్ట సమయాల్లో తన కుటుంబం తనకు అండగా లేదంటూ మోనాలిసా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో నెటిజన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.
పరువు నష్టం దావా వేస్తా
ఇక తనపై వస్తున్న నెగిటివిటీ, మోనాలిసా చేసిన ఆరోపణలు తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించాడు. మోనాలిసా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన పెళ్లిని వ్యతిరేకించాననే కోపంతోనే ఆమె తనపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిందని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ‘నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో.. ఆమె నన్ను ఇబ్బందుల్లో పడేసింది. కేవలం తను ఫర్మాన్ ఖాన్‌తో వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించాననే కోపంతో మోనాలిసా నాపై ఈ ఆరోపణలు చేసింది. తనకు నటించడం కూడా నేనే నేర్పించా.. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని నా ఇంట్లోనే నివసిస్తున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. ఇంట్లో ప్రత్యేక హోమం, వీడియో వైరల్
సినిమాను ఆపేస్తా..
ఆమె పెళ్లిని వద్దన్నందుకే ఇలా చేసింది. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లిని వ్యతిరేకించారు. ఈ వివాహం చెల్లదని ప్రకటించారు’ అని అన్నారు. అలాగే ‘మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తాను. ఒకవేళ ఆమె చెప్పింది నిజమైతే ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు. ఇక ఈ సినిమా నిర్మాణం ఇక జరగదు.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక సినిమా అనేది పూర్తిగా వేరే అంశం’ అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా మోనాలిసా ప్రదాన పాత్రలో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అని మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.

