Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభDirector Teja: మోసగాళ్ల చేతిలో చిక్కి భారీగా నష్టపోయిన డైరెక్టర్ తేజ తనయుడు

Director Teja: మోసగాళ్ల చేతిలో చిక్కి భారీగా నష్టపోయిన డైరెక్టర్ తేజ తనయుడు

Director Teja: డైరెక్టర్ తేజ పర్సనల్ విషయాలు ఎక్కువగా తెరపైకి రావన్న సంగతి తెలిసిందే. తేజ తన ఫ్యామిలీ విషయాల్ని, ఫ్యామిలీ మెంబర్లని కూడా ఎక్కువగా ఇంటర్వ్యూల్లో ప్రస్తావించడు. అయితే తాజాగా తేజ తనయుడు అమితవ్ తేజ ఇప్పుడు వార్తల్లో వైరల్ అవుతున్నాడు. సైబర్ నేరగాళ్లు మన చుట్టూనే ఉన్నారని, వారి చేతిలో అమాయకులు ఎలా బలి అవుతున్నారో నిత్యం కథనాలు వింటూనే ఉన్నాం. మన ఆశ, అత్యాశలే వారి పెట్టుబడులు అవుతుంటాయి. ఇక ఈ క్రమంలోనే అలాంటి వారి చేతిలో చిక్కి లక్షలకు లక్షలు మోసపోయాడు అమితవ్ తేజ.

- Advertisement -

ఎక్కువ లాభాలు వస్తాయని స్టాక్ మార్కెట్, ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అమితవ్ తేజకు చెప్పారట. లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పడం, వారంలోనే తొమ్మిది లక్షల లాభం వచ్చిందని చూపించడంతో అమితవ్ తేజ వారికి మరింతగా డబ్బులు ఇచ్చారట. అలా మొత్తంగా 63 లక్షలు మోసపోయినట్టుగా సమాచారం. చివరకు వారు కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అసలు విషయం అర్థం చేసుకున్నాడట. ఇచ్చిన డబ్బులు గానీ, వచ్చిన లాభం గానీ తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్నాడట.

Also Read – Sudha Kongara: విజయ్ అభిమానులపై లేడీ డైరెక్టర్ అసహనం

ఇక ఈ విషయంపై అమితవ్ తేజ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. ఐటీ యాక్ట్, చీటింగ్ కేసు కింద నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు. హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా అమితవ్ తేజ గురించి వార్తలు వచ్చాయి. కానీ సినిమాల విషయంలో వైరల్ అవ్వాల్సిన వాడు.. ఇలా మోసగాళ్ల చేతిలో చిక్కి మోసపోయాడు అని వార్తలు వచ్చాయి. మొత్తానికి హీరోగా డెబ్యూ కాకముందే వార్తల్లో మాత్రం ఇలా ట్రెండ్ అవుతున్నాడు.

దర్శకుడు తేజ ఇప్పుడు సినిమాలు అంతగా తీయడం లేదన్న సంగతి తెలిసిందే. ఇక చివరగా రానా తమ్ముడు అభిరాంతో ఓ మూవీని తీశాడు.

Also Read – Rishab Shetty: 70 కోట్లు అడిగిన రిషబ్.. తెల్లమొహంవేసిన నిర్మాత

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News