Thursday, December 11, 2025
Homeచిత్ర ప్రభUday Kiran: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ దర్శకుడికి ఏం చెప్పాడు.. ఇన్నేళ్ళకి వైరల్...

Uday Kiran: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ దర్శకుడికి ఏం చెప్పాడు.. ఇన్నేళ్ళకి వైరల్ అవుతున్న న్యూస్

Uday Kiran: టాలీవుడ్ లో ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది హీరో ఉదయ్ కిరణ్ మరణం. అతను చనిపోయాక ఎంతోమంది ఎన్నో విషయాలను బయటపెట్టారు. కానీ, అవన్నీ ఎంతవరకు వాస్తవం అనే సందేహాలు అలాగే ఉండిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకదశలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వి ఎన్ ఆదిత్య మంచి పేరు సంపాదించుకున్నాడు. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన ఆదిత్య ఆ తర్వాత మాత్రం ఎందుకనో దర్శకుడిగా కంటిన్యూ అవలేకపోయాడు.

- Advertisement -

వాస్తవానికి వి ఎన్ ఆదిత్య మెగాస్టార్ నటించిన బావగారూ బావున్నారా, బాలకృష్ణ నటించిన భైరవద్వీపం లాంటి సినిమాలకి అసోసియేట్ గా వర్క్ చేసి మంచి బాండింగ్ ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ, మనసంతా నువ్వే సినిమా చూస్తే అందరికీ గుర్తొచ్చేది ఈయనే. అలా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది.

Also Read – Girija Oak: నీ రేటెంత అంటున్నారు.. నటి ఆవేదన

చిత్రం, నువ్వు నేను సినిమాలతో హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాడు. ఒకదశలో ఉదయ్ కిరణ్ సినిమాలు వరుసగా హిట్ అవుతూ స్టార్ హీరోకి కూడా థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే, అనూహ్యంగా ఉదయ్ కి ఫ్లాపులు రావడం, సినిమాలు తగ్గిపోవడం మనో వేదనతో మృతి చెందడం అందరికీ తెలిసిందే. ఉదయ్ మరణించే 6 రోజుల ముందు వీ ఎన్ ఆదిత్యతో దాదాపు 5-6 గంటలు మాట్లాడట.

అది కూడా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా గురించి. ఈ సినిమా చాలా బావుందని, పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో క్లీన్ ఫ్యామిలీ సినిమా చేసి హిట్ కొట్టారనీ, ఇలాంటి కథలు మీరు రాయండి, లేదా వినండి.. మనం చేద్దాం అని మాట్లాడాడట. అంతేకాదు, ఒక మాస్ కథ కావాలని ఆదిత్యని చాలాసార్లు అడిగాడని ఆయన ఇటీవల చెప్పారు. నిజంగా ఉదయ్ కిరణ్ అటు క్లాస్ ఇటు మాస్ జోనర్ సినిమాలకి సరిపోయే హీరో. ఇప్పుడు మన ముందు ఉంటే గ్యారెంటీగా పాన్ ఇండియా రేంజ్ కి చేరుకునే వాడనడంలో సందేహం లేదు.

Also Read – Keerthy Suresh: ఎల్ల‌మ్మ క‌ష్టాలు కంటిన్యూ – సినిమా నుంచి త‌ప్పుకున్న కీర్తి సురేష్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News