Lucky Bhaskar: దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ మూవీ లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌ను అఫీషియల్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి అనౌన్స్‌చేశాడు. రీసెంట్‌గా ఓ తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా హాజరయ్యాడు వెంకీ అట్లూరి. ఈ షోలో మీ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల్లో దేనికైనా సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచన ఉందా అని వెంకీ అట్లూరిని హోస్ట్ ప్రశ్న అడిగింది. సార్ సినిమాకు కష్టమే కానీ లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ ఉండొచ్చు అని వెంకీ అట్లూరి సమాధానమిచ్చాడు. లక్కీ భాస్కర్ సీక్వెల్ గురించి వెంకీ అట్లూరి కామెంట్స్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దుల్కర్ సల్మాన్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
110 కోట్ల కలెక్షన్స్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్యాంకు
మోసాల నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాను తెరకెక్కించారు. మోస్తారు అంచనాలతో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. 110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వెంకీ అట్లూరి టేకింగ్, మేకింగ్‌తో పాటు దుల్కర్ సల్మాన్ యాక్టింగ్‌కు అభిమానుల నుంచి ప్రశంసలు దక్కాయి. సీక్వెల్‌లో కూడా బ్యాంకు మోసాలకు సంబంధించిన పాయింట్‌ను కొత్త కోణంలో టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkata-ramana-title-fixed-for-venkatesh-and-trivikram-movie/
సూర్యతో సినిమా…
లక్కీ భాస్కర్ సక్సెస్ తర్వాత కోలీవుడ్ అగ్ర హీరో సూర్యతో (Suriya) ఓ మూవీ చేస్తోన్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. మరోవైపు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. పవన్ సాదినేని (Pavan Sadineni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.