దర్శకుడు వివి వినాయక్(VV Vinayak) మరోసారి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్, దర్శకులు సుకుమార్, డాలీ, వాసు వర్మ, రికొంతమంది సన్నిహితులు వినాయక్ ఇంటికి వెళ్లి పరామర్శించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. కొన్నాళ్లుగా వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కూడా జరిగింది. అనారోగ్యం కారణంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
చివరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. కాగా దిల్, ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, బన్నీ, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి హిట్ సినిమాలతో సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. వినాయక్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.