Saturday, November 2, 2024
Homeచిత్ర ప్రభNandamuri: హరికృష్ణ మనవడు.. నందమూరి నాలుగో తరం వారసుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది

Nandamuri: హరికృష్ణ మనవడు.. నందమూరి నాలుగో తరం వారసుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది

Nandamuri| సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్‌ కుమారుడు..తారక రామారావు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నందమూరి(Nandamuri) నాలుగో తరం నట వారసుడిని ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి(YVS Chowdary) ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇవాళ హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా వైవిఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. సీనియర్‌ ఎన్టీఆర్‌పై ఆసక్తితో తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నట్లు వివరించారు. ఎన్టీఆర్‌ తన మునిమనవడు రూపంలో వచ్చారని.. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది అన్నారు. ఈ హీరోకు నందమూరి కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ ఫస్ట్ లుక్ వీడియోలో తారక రామారావు.. పవర్ ఫుల్ లుక్స్, బేస్ వాయిస్‌తో ఆకట్టుకునే లుక్‌లో దర్శనం ఇచ్చాడు. అమెరికాలో యాక్టింగ్‌లో మాస్టర్స్ చేసి, అన్ని కళలలో ప్రావిణ్యం సాధించాడు. ఈ వీడియోలో “నేను నందమూరి తారక రామారావు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాను. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో, ముత్తాత తారక రామారావు ఆశీస్సులతో సినిమాల్లోకి వస్తున్నాను. మీ అందరి అంచనాలను అందుకుంటున్నానని.. నందమూరి కుటుంబం పరువు నిలబడేలా సినిమాల్లో కష్టపడతానని.. ప్రమాణం చేస్తున్నాను” అని ఈ వీడియోలో తెలిపారు. కాగా ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News