Thursday, February 20, 2025
Homeచిత్ర ప్రభRajamouli: రష్మీతో రాజమౌళి లవ్.. వీడియో వైరల్

Rajamouli: రష్మీతో రాజమౌళి లవ్.. వీడియో వైరల్

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తన సినిమాలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్చపరుసున్నారు. ఇప్పటివరకు అపజయమే లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. బాహుబలితో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేశారు. RRR మూవీతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా విజయం సాధించారు. అలాంటి రాజమౌళికి ఓ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. యాంకర్‌తో రాజమౌళి రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్‌ అవుతున్నారు.

- Advertisement -

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మాటీవీలో వచ్చిన యువ సీరియల్‌ గుర్తుందా..? దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ సీరియల్ బుల్లి తెర ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్‌లో రాజమౌళి గెస్ట్ రోల్‌లో కనిపించగా.. యాంకర్ రష్మీ(Rashmi) ఓ కీలక పాత్ర పోషించింది. ఇందులో రష్మితో అపరిచిత వ్యక్తిగా ఫోన్ లోనే ప్రేమాయణం సాగించిన రాజమౌళి.. ఆమెను స్వయంగా మీట్ అవ్వడానికి వచ్చాడు. ఆయన్ను అక్కడ చూసిన రష్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతుంది. ఇన్నాళ్లూ తనతో ఫోన్ లో మాట్లాడింది రాజమౌళినా అని సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇక జక్కన్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News