Homeచిత్ర ప్రభDNA Movie: శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్‌ - శ‌నివారం ఓటీటీ స్ట్రీమింగ్ - ఓ మై...

DNA Movie: శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్‌ – శ‌నివారం ఓటీటీ స్ట్రీమింగ్ – ఓ మై బేబీ ట్విస్ట్‌!

DNA Movie: అధ‌ర్వ‌ ముర‌ళి, నిమిషా స‌జ‌య‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన‌ త‌మిళ మూవీ డీఎన్ఏ థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి నెల్స‌న్ వెంక‌టేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అధ‌ర్వ ముర‌ళి యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్‌, స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అధ‌ర్వ ముర‌ళి కెరీర్‌లో డిఫ‌రెంట్ మూవీగా ప్ర‌శంస‌లు అందుకున్న‌ది.

- Advertisement -

మై బేబీ పేరుతో…
డీఎన్ఏ మూవీ తెలుగులో మై బేబీ పేరుతో డ‌బ్ అవుతోంది. ఈ డ‌బ్బింగ్ వెర్ష‌న్ జూలై 18న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. కాగా తెలుగు నిర్మాత‌కు జియో హాట్‌స్టార్ పెద్ద షాకిచ్చింది.

Also Read – HONOR X70: 8300mAh బిగ్ బ్యాటరీతో హానర్ X70 స్మార్ట్ ఫోన్..

జూలై 19న రిలీజ్‌…
డీఎన్ఏ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను జియో హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను జియో హాట్ స్టార్ బుధ‌వారం అనౌన్స్‌చేసింది. జూలై 19న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఒక్క రోజు గ్యాప్‌లోనే…
డీఎన్ఏ తెలుగు వెర్ష‌న్ మై బేబీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుండ‌గా… ఒక్క రోజు గ్యాప్‌లోనే తెలుగులో ఈ మూవీ ఓటీటీలో విడుద‌ల‌కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగు వెర్ష‌న్… మై బేబిని నిర్మాత‌ సురేష్ కొండేటి రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 350 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు సురేష్ కొండేటి ప్ర‌క‌టించారు.

ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌…
2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ద‌ర్శ‌కుడు నెల్స‌న్ వెంక‌టేష‌న్ ఈ మూవీని రూపొందించారు. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

Also Read – PM Modi: త్వరలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ..!

డీఎన్ఏ క‌థ ఏంటంటే?
దివ్య బోర్డ‌ర్‌లైన్ మ‌ల్టీపుల్ డిజార్డ‌ర్ అనే మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది. పెళ్లి కావ‌డం క‌ష్టంగా మారుతుంది. ఆనంద్ ల‌వ్‌లో ఫెయిలై తాగుడుకు బానిస‌గా మారుతాడు. అనుకోకుండా దివ్య‌, ఆనంద్‌ల‌కు పెళ్లి జ‌రుగుతుంది. దివ్య‌కున్న మాన‌సిక స‌మ‌స్య కార‌ణంగా ఆనంద్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News