Homeచిత్ర ప్రభAvengers: ‘అవెంజర్స్ లో పవర్ ఫుల్ విల్లన్ డాక్టర్ డూమ్‌

Avengers: ‘అవెంజర్స్ లో పవర్ ఫుల్ విల్లన్ డాక్టర్ డూమ్‌

హాలీవుడ్ లో మార్వెల్ స్టూడియోస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఐదు కొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ ప్రంపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు. భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మార్వెల్ సినిమాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద సినీ వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News