Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభDrushyam 3: దృశ్యం 3 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన సురేష్ బాబు

Drushyam 3: దృశ్యం 3 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన సురేష్ బాబు

Drushyam 3: ‘దృశ్యం 3’ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సిరీస్‌లో ఇది మూడవ భాగం. ఇంతకముందు వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు మంచి సక్సెస్‌ని సాధించిన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓ సమస్య వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే ఆసక్తికరమైన అంశానికి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమాలు అన్నీ భాషలలో మంచి విజయాన్ని అందుకున్నాయి.

- Advertisement -

మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించారు. ఆ సినిమాను, తెలుగులో వెంకటేష్.. మీనాలతో రీమేక్ చేశారు. అలాగే, హిందీలో అజయ్ దేవగన్-శ్రియ శరణ్ నటించారు. కమల్ హాసన్, గౌతమి నటించారు. ఈ భాషలన్నిటిలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి మూడవ భాగాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకీకి కూడా ఈ సినిమా సీక్వెల్స్ బాగా కలిసివచ్చాయని చెప్పాలి.

Also Read – Silver : వెండి విశ్వరూపం..ఒక్క నెలలోనే లక్షకుపైగా పెరిగిన ధర

వెంకీ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న దృశ్యం సీక్వెల్‌లో పార్ట్ 3 చర్చ వచ్చినప్పటి నుంచి ఇది ఎప్పుడెప్పుడు మొదలవుతుందా! అనే ఆసక్తి మొదలైంది. అయితే, ముందు రెండు రెండు భాగాలు మలయాళంలో వచ్చిన తర్వాతే తెలుగులో వచ్చాయి. అలాగే, పార్ట్ 3 కూడా ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి, అక్టోబర్ నుంచి ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వచ్చేస్తుందని సురేష్ బాబు కన్‌ఫర్మ్ చేశారు.

హిందీ వెర్షన్ కూడా అక్టోబర్ నెలలోనే రాబోతుంది. ప్రస్తుతం వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఆదర్శ కుటుంబం’ అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అవగానే ‘దృశ్యం 3’ మొదలవబోతుందని సమాచారం. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్ళీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ఉండబోతుందని దీనికి సంబందించిన అఫీషియల్ అప్‌డేట్ కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దృశ్యం 3’ అప్‌డేట్ వచ్చేసింది.

Also Read – Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి అండగా పవన్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News