Kaantha Movie: దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత మూవీ రిలీజ్ ముంగిట చిక్కుల్లో పడింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. కాంత మూవీ నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు.
రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఓ స్టార్ హీరోకు, దర్శకుడికి మధ్య ఈగో వార్ చుట్టూ కాంత కథ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా కోలీవుడ్‌లో ఫస్ట్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ భగవతార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాంత ట్రైలర్, టీజర్‌లోని విజువల్స్, డైలాగ్స్, బ్యాక్‌డ్రాప్, క్యారెక్టర్లు అన్ని త్యాగరాజ భగవతార్ జీవితానికి దగ్గరగా ఉండటం బయోపిక్ వార్తలకు బలాన్ని చేకూర్చింది. మేకర్స్ మాత్రం త్యాగరాజ భగవతార్ బయోపిక్ ఇదని ఇప్పటివరకు వెల్లడించలేదు.
Also Read- Lokesh Kanagaraj: హీరోగా డెబ్యూ మూవీ కోసం షాకింగ్ రెమ్యూనరేషన్ – లోకేష్ కనగరాజ్ తగ్గేదేలే
దీంతో ‘కాంత’ మూవీని బ్యాన్ చేయాలంటూ త్యాగరాజ భగవతార్ మనవడు ఉపాసన సంజీవ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి తీసుకోకుండా త్యాగరాజ భగవతార్ బయోపిక్‌ను తెరకెక్కించారని హైకోర్టులో పిటీషన్ వేశాడు. కాంత సినిమాలో తమ తాతను నెగెటివ్ రోల్‌లో చూపించారని, ఫేమ్ కోసం అడ్డదారులు తొక్కినట్లు ఆయన వ్యక్తిత్వాన్ని వక్రీకరించారని ఉపాసన సంజీవ్ పేర్కొన్నారు. చివరి రోజుల్లో తాతయ్య పేదరికం అనుభవించినట్లుగా సినిమాలో తప్పుగా చూపించారని పిటీషన్‌లో వెల్లడించాడు. కాంత సినిమాను రిలీజ్ కాకుండా బ్యాన్ చేయడమే కాకుండా లీగల్‌గా మేకర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఉపాసన సంజీవ్ పిటీషన్ కోర్టు స్వీకరించింది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ పిటీషన్‌తో సంబంధం లేకుండా మేకర్స్ మాత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. 1940-60 మధ్య కాలంలో తమిళంలో పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోగా కనిపించాడు త్యాగరాజ భగవతార్. ఎంజీఆర్ కంటే ముందు కోలీవుడ్‌లో ఫస్ట్ సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఫిలిం జర్నలిస్ట్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో భగవతార్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలైంది.


