Divvala Madhuri: ‘ముద్దమందారం’ సీరియల్ ఫేం తనూజ పుట్టస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ నటి అయిన తనూజ ఈ సీరియల్‌తో తెలుగులో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల వచ్చిన తెలుగు బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ఆమె మరింత పాపులర్ అయ్యింది. ఈ షోలో తనదైన ఆట, పాటతో ఎంతో అభిమానుల మనసు గెలుచుకుంది.
ఇక హౌజ్ మేట్స్ తో క్లోజ్ గా ఉంటూ అందరితో సన్నిహితంగా మెదిలింది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో తనూజకు అత్యంత సన్నిహితురాలు ఎవరనేది కూడా తెలిసిందే. ఆమె దువ్వాడ మాధురి. బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. తనూజకు బాగా దగ్గరైంది. రాజా రాజా అని పిలుచుకుంటు తనూజ వెంటే ఉంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా తనూజతో అంతే సన్నిహితంగా మెదులుతోంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా తనూజని కలుస్తూ వారి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.
తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్
అయితే, ఈ రోజు (మార్చి 5) తనూజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దువ్వాడ మాధురి తనూజ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక తనూజ జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే. దీంతో తన స్నేహితురాలి కోసం మాధురి బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. తనతో జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే కావడంతో నానా హడావుడి చేసింది. తనూజతో కేక్ కట్ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మాధురి స్పెషల్ గిఫ్ట్
“హ్యాపీ బర్త్‌డే బంగారా.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను” అంటూ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. అలాగే తనూజ బర్త్ డే సందర్బంగా వీరు తిరుమల తీరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలలో దిగిన ఫోటోలను కూడా మాధురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram

