Tuesday, December 9, 2025
HomeTop StoriesDuvvada Srinivas - Madhuri: తెరపైకి దువ్వాడ జంట.. ‘ప్రేమంటే’ ప్రత్యేకతలివే

Duvvada Srinivas – Madhuri: తెరపైకి దువ్వాడ జంట.. ‘ప్రేమంటే’ ప్రత్యేకతలివే

Duvvada Srinivas – Madhuri: సోషల్ మీడియాలో దువ్వాడ జంటకు ఉన్న క్రేజ్, పెరిగిన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దువ్వాడ జంట మీద వచ్చినన్నీ రీల్స్, మీమ్స్ ఈ మధ్య కాలంలో ఏ జంట మీద వచ్చి ఉండవు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ మధ్య మాధురి అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో మాధురి చేసిన రచ్చకి సోషల్ మీడియాలో కొత్త మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి.

- Advertisement -

ఇక ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఏం అయిపోయినా పర్లేదు ఈ జంట మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది అంటూ జనాలు మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. ఇక ఈ జంట ఇప్పుడు తెరపైకి రాబోతోంది. ప్రేమంటే చిత్రంలో దువ్వాడ జంట స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారట. గెస్ట్ అప్పియరెన్స్‌లో వీరి పాత్ర ఉంటుందని సమాచారం. వీరిద్దరూ కలిసి ఇది వరకే ఓ షార్ట్ ఫిల్మ్ చేసిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన క్లిప్స్, సీన్స్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యాయో, ట్రోలింగ్ బారిన పడ్డాయో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తెరపై ఈ జంట కనిపించిన తరువాత ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.

Also Read – Sreeleela: డెబ్యూ మూవీ కోసం త‌మిళంలో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన శ్రీలీల

ప్రేమంటే చిత్రంలో ఇలాంటి సర్ ప్రైజ్‌లు చాలానే ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రేమంటే లవ్ ట్రోట్టర్ ఈవెంట్‌లో సుమ కూడా ఓ లీక్ చేసింది. జర్నలిస్ట్ మూర్తి కూడా ఇందులో ఓ పాత్రని పోషించాడని లీక్ చేసింది. అంతే కాకుండా మరో ఇంట్రెస్టింగ్ పాత్ర కూడా ఉందని, అందులో నటించిన వ్యక్తి ఎవరో గెస్ చేయండని సుమ క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే.

ప్రియదర్శి, ఆనంది, సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది వంటి వారు నటించిన ఈ మూవీని నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఏసియన్ గ్రూప్ బ్యానర్ మీద జాన్వీ నారంగ్ ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికే లియోన్ జేమ్స్ ఇచ్చిన పాటలు అందరినీ అలరించాయి. ఈ చిత్రం నవంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ వారం బరిలోకి చాలా చిత్రాలు దిగుతున్నాయి. అందులో ప్రేమంటే మూవీ మీద అంతో ఇంతో బజ్ అయితే ఏర్పడింది. మరి ప్రియదర్శి గత చిత్రంలా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందో.. హిట్ అవుతుందో చూడాలి.

Also Read – Highest Budget Movie: ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాలు ఇవే – టాప్ త్రీలో మ‌హేష్‌బాబు, బ‌న్నీ మూవీస్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News