Friday, February 13, 2026
HomeTop StoriesEesha Rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు.. మొత్తానికి బయటపెట్టేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు.. మొత్తానికి బయటపెట్టేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల కంటే.. పక్కన కనిపించే, నటించే అమ్మాయిలకే ఎక్కువ క్రేజ్ వస్తుంటుంది. అయితే దర్శకులు కొందరిని క్యాస్ట్ చేసుకునే టైంలో కొన్ని హామీలు ఇస్తుంటారు. ఇందులో నీ పాత్రే ఇంపార్టెంట్.. నీకే ఎక్కువ స్పేస్ ఉంటుంది.. నువ్వే మెయిన్ లీడ్.. సెకండ్ లీడ్ అని ఇలా చెబుతుంటారు. కానీ తీరా సినిమా చూస్తే అసలు ఆ పాత్ర ఉండదు.. ఉన్నా కూడా రెండు మూడు సీన్లకే పరిమితం అవుతుంటుంది. అయితే ఇప్పుడు అలా తనకు ఎదురైన ఓ ఘటన గురించి ఈషా రెబ్బా బయటకు చెప్పేసింది.

- Advertisement -

ఈషా రెబ్బాకి కావాల్సినంత అందం, కావాల్సినంత ప్రతిభ కూడా ఉంది. పైగా మన తెలుగమ్మాయి. కానీ ఆమెకు మాత్రం సరైన అవకాశాలు, విజయాలు దక్కడం లేదనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆమె ఓం శాంతి శాంతి శాంతి అనే ఓ మలయాళీ రీమేక్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జయ జయ జయ జయహే మూవీకి తెలుగు వర్షెన్ ఆల్రెడీ ఉంది. అయినా కూడా మేకర్లు ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. ఇక అక్కడ దర్శన పోషించిన పాత్రను ఇక్కడ ఈషా రెబ్బా పోషించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో త్రివిక్రమ్ మీద ఈషా రెబ్బా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Also Read – Archana Ravindran: అరుణాచలం కొండెక్కిన బిగ్ బాస్ బ్యూటీకి జరిమాన

అరవింద సమేత టైంలో త్రివిక్రమ్ తనకు సెకండ్ హీరోయిన్ అని చెప్పి.. పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారట. కానీ తీరా సినిమా చూసిన తరువాత చాలా మంది ఇలాంటి పాత్రను ఎందుకు చేశావ్ అని అన్నారట. కథ విన్నాక సినిమాని చేయాలని అనుకుందట. కానీ ఇలాంటి కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రలు చేస్తే ఆడియెన్స్ ఆదరించరు కదా? అని అనుకుందట. అయితే బడా హీరో, పెద్ద దర్శక, నిర్మాతలు కదా అని అనుకుందట.

చివరకు తనకు చెప్పిన పాత్ర ఒకటి.. సినిమా పూర్తయిన తర్వాత వచ్చింది ఒకటి అని అలా త్రివిక్రమ్ తనను మోసం చేశాడు అన్నట్టుగా పరోక్షంగా పేరు ఎత్తకుండానే ఈషా రెబ్బా తన మనసులో ఉన్నదంతా చెప్పుకొచ్చింది. ఇకపై అలాంటి సెకండ్ లీడ్ పాత్రలు ఈషా రెబ్బా ఒప్పుకోకపోవచ్చన్నట్టుగానే కనిపిస్తోంది.

Also Read – Varanasi Release Date: ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఇదేనా?.. జక్కన్న ప్లాన్ అదుర్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News