Monday, September 16, 2024
Homeచిత్ర ప్రభEmmiganuru: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ సంతోషకరం

Emmiganuru: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ సంతోషకరం

అన్ స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని టిడిపి నాయకులు, నందమూరి అభిమానులు హోటల్ చంద్ర, టిడిపి మాజీ కౌన్సిలర్ రంగస్వామిగౌడ్, రమేష్, పేర్కొన్నారు.

- Advertisement -

శుక్రవారం పట్టణంలోని శివన్న నగర్ లో నందమూరి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. జన్మదినం సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం సంతోషకరం అన్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సినీరంగ ఆరంగేట్రం చేస్తున్న నందమూరి మోక్షజ్ఞ వారి తాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు కీర్తిని అలాగే నందమూరి బాలకృష్ణ వంశపారంపర్యాన్ని కొనసాగిస్తూ తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహారాజుల వెలుగొందాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు వాల్మీకి రాజు, గోల్డ్ ఈరన్న, వాల్మీకి వీరేష్, గిడ్డయ్య, గుడికల్ రాముడు, మిన్నల్లా, వీరేష్ గౌడ్, నాగరాజు, గోవిందు, కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News