Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభWaltair Veerayya: 'వీరయ్య' అయినా మెగాస్టార్ పరువు నిలబెడతాడా?

Waltair Veerayya: ‘వీరయ్య’ అయినా మెగాస్టార్ పరువు నిలబెడతాడా?

- Advertisement -

Waltair Veerayya: హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా మెగాస్టార్ ఇప్పుడు వరస సినిమాలను తెచ్చే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ‘వాల్తేర్ వీరయ్య’ షూటింగ్‌ జరుగుతుండగా.. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు మాస్ గెటప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవలే ‘బాస్ వొచ్చిండు’ సాంగ్‌తో అటెన్షన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా వాల్తేర్ వీరయ్య ఒకప్పటి ముఠామేస్త్రి రోజులను గుర్తు చేస్తున్నాడు.

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సినిమాను జనవరి 13న సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్యాలన్స్ సాంగ్స్ చిత్రీకరించేందుకు యూరప్ వెళ్ళింది మూవీ టీం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా అయినా మెగాస్టార్ స్థాయి బ్లాక్ బస్టర్ కొట్టి పరువు నిలబడుతుందా అనే ఆసక్తి నెలకొంది.

ఎవరు ఎన్ని చెప్పినా మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా కాలంగా ఆయన స్థాయి బ్లాక్ బస్టర్ హిట్టు పడలేదు. సైరా నుండి గాడ్ ఫాదర్ వరకు చాలావరకు పర్వాలేదనిపించిన సినిమాలతో పాటు ఆచార్య లాంటి అట్టర్ ప్లాప్ సినిమాలు మెగాస్టార్ లిస్టులో ఉన్నాయి. కానీ ఇండస్ట్రీని షేక్ చేసే స్థాయిలో బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం లేవు. ఒక్కసారి ఇంద్ర లాంటి రికార్దులను తిరగరాసే సినిమా పడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి వాల్తేర్ వీరయ్య అయినా అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News