విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ లో ఫ్యామిలీ స్టార్ ది దేవరకొండ బ్రదర్స్ సందడి చేశారు. విజయ్ ఏకంగా కామెంటరీ బాక్స్ లో తన క్రికెట్ లవ్ చాటుకున్నారు. ఇక ఈమేరకు దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ పిక్స్, ట్వీట్స్ తో ఆకట్టుకుంటున్నారు. హిట్ కోసం వేచి చూస్తున్న విజయ్ దేవరకొండ గీతగోవిందం డైరెక్టర్ కాంబోతో హిట్ కొట్టడం ఖాయమనేలా విశ్వాసం వ్యక్తంచేస్తుండగా ఇప్పటి వరకూ సినిమా ఫీల్ గుడ్ గా ఉందనే మౌత్ టాక్ ఊపందకుంది.

