RB Choudhary Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆర్‌బీ చౌదరి కన్ను మూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారని తెలుస్తోంది.
ఆర్‌బీ చౌదరి స్థాపించిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 90కి పైగా చిత్రాలను నిర్మించారు. ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘సుస్వాగతం’, ‘నువ్వు వస్తావని’, నిన్నే ప్రేనిస్తా, ‘సంక్రాంతి’, ‘నవవసంతం’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్‌లను ఆయన అందించారు. నిర్మాతగా ఆయన తన కెరీర్‌లో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. ప్రముఖ నటులు జీవా, జితన్ రమేష్ ఈయన కుమారులే.
Also Read: https://teluguprabha.net/national-news/two-indian-journalists-win-pulitzer-award/
దిగ్గజ నిర్మాత మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

