Monday, December 9, 2024
Homeచిత్ర ప్రభHarsha sai: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన హర్షసాయి.. ఏమన్నాడంటే..?

Harsha sai: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన హర్షసాయి.. ఏమన్నాడంటే..?

Harsha sai| లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(Harsha sai) సడెన్‌గా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అబద్ధమని తెలిపాడు. తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్లు కాపీరైట్స్ అడగటం ఏంటని ప్రశ్నించాడు. తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టంచేశాడు. డబ్బు మనిషితో ఏదైనా చేయిస్తుందంటే నమ్మలేదని.. ఇప్పుడు కూడా తన విషయంలో అదే జరిగిందన్నారు. కొందరు కావాలనే తనపై కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. విచారణలో నిజాలు బయటకు వచ్చాయని..అందుకే తెలంగాణ హైకోర్టులో బెయిల్ ఇచ్చిందని వెల్లడించాడు.

- Advertisement -

కాగా యూట్యూబ్‌ వీడియోలతో హర్షసాయి బాగా ఫేమస్ అయ్యాడు. మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తూ చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ఇటీవల బెట్టింగ్‌ యాప్‌లను విపరీతంగా ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ హర్షసాయిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై అతడు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్‌లోకి వచ్చిన నటి, హర్షసాయి ఓ పార్టీలో కలిశారు.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శారీరకంగా దగ్గరయ్యారు.

ఇదిలా ఉండగానే హర్షసాయి తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టగా.. అందులో సదరు నటిని హీరోయిన్‌గా తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ యువతి ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అయితే.. సినిమా కాపీరైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలతో తనను బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేయడం ప్రారంభించారు. విచారణలో హర్షసాయి ఆచూకీ తెలియకపోవడంతో లుక్అవుట్ నోటీసులు కూడా జారీచేశారు. ఈ క్రమంలోనే అతడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హర్షసాయికి బెయిల్ మంజూరుచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News