Homeచిత్ర ప్రభAllu Cinemas: అల్లు సినిమాస్‌లో ఆ డైరెక్టర్లకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

Allu Cinemas: అల్లు సినిమాస్‌లో ఆ డైరెక్టర్లకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

Allu Cinemas: అల్లు సినిమాస్ లెజెండర్‌ డైరెక్టర్ వాల్‌ పై అసంతృప్తి నెలకొంది. ఇందులో డైరెక్టర్‌ శంకర్, పూరీ జగన్నాథ్‌, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి అగ్ర దర్శకులను అవమానించారంటూ అభిమానులు, నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. కాగా హైదరాబాద్‌లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది.

- Advertisement -

సీఎం చేతుల మీదుగా ప్రారంభం
అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ అల్లు సినిమాస్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ స్టూడియోలో ఎన్నో ఆకట్టుకునే అంశాలు కనిపించాయి. అందులో ముఖ్యంగా దక్షిణాది చెందిన లెజెండరీ డైరెక్టర్ల వాల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇందులో ఎస్‌ఎస్‌ రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ప్రశాంత్‌ నీల్‌, అట్లీ ఇలా పలువురి డైరెక్టర్ల ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో తెలుగు ఆడియన్స్‌ తో పాటు కోలీవుడ్‌ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆ డైరెక్టర్ల జాబితాలో పలువురి సౌత్‌ స్టార్‌ డైరెక్టర్లు లేకపోవడమే.

ఆ డైరెక్టర్ల ఫోటోలు ఎక్కడ? 
అదే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, సౌత్‌ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు కెరీర్‌ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, శ్రీనువైట్ల, శివ లాంటి యాక్షన్‌ జానర్‌ని సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామ్‌ గోపాల్‌ వర్మల ఫోటోలు ఇక్కడ కనిపించలేదు. దీంతో అల్లు సినిమాస్‌పై మూవీ లవర్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ ఇండస్ట్రీలో ఈ సాయిలో ఉండటానికి ప్రధాన కారణం వారే అని, సౌత్‌ ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్‌ స్థాయికి వెల్లడంలో వారు కీలక పాత్ర పోషించారు. వారి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు కమర్షియల్‌ పెద్ద విజయం సాధించాయి. ఇతర భాషల్లోనూ, విదేశాల్లో ప్రదర్శితమై ఆకట్టుకున్నాయి. అలాంటి డైరెక్టర్‌ ఇంతగా అవమానించారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Actor Nassar: ముదురుతున్న వివాదం.. రాజేంద్రప్రసాద్‌పై నటుడు నాజర్‌ సీరియస్‌

అట్లీ, ప్రశాంత్ నీల్ ఎందుకు?
మరోవైపు అలాంటి అగ్ర దర్శకులకు ఆ గ్యాలరీలో చోటు ఇవ్వకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఆ గ్యాలరీలో అట్లీ, ప్రశాంత్‌నీల్‌కు చోటు ఇవ్వడంపై తెలుగు ఆడియన్స్‌ నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. తెలుగులో ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లను మరిచి ఇతర భాష డైరెక్టర్లకు ఇక్కడ చోటు ఇవ్వడం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దక్షిణ భారత వాణిజ్య సినిమా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దర్శకులకు కూడా అక్కడ స్థానం దక్కాలని సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కావాలనే వారి ఫోటోలు పెట్టలేదా? లేక ఆ డైరెక్టర్లను అల్లు ఫ్యామిలీ గుర్తించకనే ఈ తప్పిదం జరిగిందా? అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న. మరి దీనిపై అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News