Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi: చిరు రూటు మార్చేదెప్పుడు..!

Chiranjeevi: చిరు రూటు మార్చేదెప్పుడు..!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయని అటు ఇండస్ట్రీ వారు, ఇటు అభిమానులు అంచనాలు వేసుకుంటుంటారు. ఈ అంచనా ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతున్నదే. ఖైదీ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఫక్తు కమర్షియల్ సినిమాల మీదే దృష్టిసారిస్తూ కథలను ఎంచుకుంటున్నారు. కానీ, ఆయన స్టామినాకి తగ్గ స్టోరీస్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకోవడం లేదనేది కొందరి వాదన. ఏజ్‌కి తగ్గ కథలను మెగాస్టార్ ఎంచుకోవడం లేదని కూడా మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

ముఖ్యంగా, మెగాస్టార్ ని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) పొల్చి చూసుకుంటున్నారు. బాలయ్య గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి భారీ కమర్షియల్ హిట్ సాధిస్తుంది. ఆయన కథలను ఎంచుకునే విధానం అందరికీ నచ్చుతుంది. ఇంకా.. నేను హీరోయిన్‌తో డాన్సులు చేయాల్సిందే..అనే ఫార్ములా కనిపించడం లేదు. అలా ఆలోచించుకుంటే ఆయన నుంచి భగవంత్ కేసరి, డాకు మహారాజ్ (Daaku Maharaj) లాంటి సినిమాలొచ్చేవే కాదు. ఆయన మార్క్ ఫ్యాక్షన్ నేపథ్యం ఉంటూనే కథలో కొత్త తరహా డ్రైవ్ కనిపిస్తోంది. అనవసరమైన కామెడీ సీన్స్ ఉండటం లేదు.

Also Read- Anushka vs Rashmika: రష్మిక వర్సెస్ అనుష్క – టాలీవుడ్ టాప్ హీరోయిన్ల బాక్సాఫీస్ వార్‌

కానీ, మెగాస్టార్ మాత్రం అభిమానులను దృష్టిలో పెట్టుకొని మూసధోరణిలోనే కథలను ఎంచుకుంటున్నారు. అందుకే, ఆయనకి హిట్ దక్కడం లేదు. గాడ్ ఫాదర్ (God Father), భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మాత్రం హిట్ చిత్రంగా నిలిచింది. బలమైన కథ, కథనాలు చిరు సినిమాలలో కనిపించడం లేదు. కామెడీ విషయానికొస్తే అసలు ఆ సీన్స్ ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆయన ఏజ్‌కి బాలయ్య మాదిరిగా అద్భుతమైన ఎమోషనల్ డ్రామా, మెలో డ్రామాలను చేయవచ్చు.

హిందీలో సంజయ్ దత్ చేసిన భూమి లాంటి చిత్రాలు చిరంజీవికి ఇప్పుడు సరిగ్గా సరిపోయే కథలు. అమితాబ్ చేసిన సర్కార్ లాంటి సినిమాలు బాగా సూటవుతాయి. కానీ, ఎందుకో మెగాస్టార్ అలాంటి కథల మీద దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర (Vishwambhara), పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మెగా 157 చేస్తున్నారు. నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల చేయబోయేది డాన్ తరహా సినిమా అని సమాచారం. మరి వీటిలోనైనా ఆయన పంథా మార్చి కనిపిస్తారా లేదా అనేది చూడాలి. బాలయ్య, వెంకటేశ్, నాగార్జునలతో పోల్చి చూస్తే చిరు సక్సెస్ రేట్ తక్కువే అని చెప్పాలి.

Also Read- Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’కి సెన్సార్ బోర్డ్‌ షాక్.. ప‌వ‌న్‌కు ఇష్ట‌మైన వాయిసే లేపేశారుగా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad