Thursday, December 12, 2024
Homeచిత్ర ప్రభFear new thriller: 'ఫియర్' ట్రైలర్

Fear new thriller: ‘ఫియర్’ ట్రైలర్

థ్రిల్లింగ్ మూవీ

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

- Advertisement -

ఈ రోజు “ఫియర్” మూవీ ట్రైలర్ ను హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. “ఫియర్” ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్న మాధవన్..ట్రైలర్ థ్రిల్ చేసిందని చెప్పారు. “ఫియర్” టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.

“ఫియర్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – సింధు (వేదిక)ను చిన్నప్పటి నుంచి మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ఎవరో తనను వెండాతున్నట్లు భయపడుతుంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ధైర్యం చెప్పినా సింధును ఈ ఫియర్ వదలదు. ఆమె జీవితంలో కొన్ని ఘటనల తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పిస్తారు. సింధును వెంటాడుతున్న ఆ బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది. సింధు పాత్రలో వేదిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేసింది. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడబోతున్న ఫీలింగ్ “ఫియర్” ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News