iBomma Bappam Complaint: తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న పైరసీ వెబ్‌సైట్లు ఐబొమ్మ, బప్పం మరోసారి నిర్మాతలకు గుదిబండగా మారాయి. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఇటీవల విడుదలైన సినిమాలు అప్‌లోడ్ కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన ఫిల్మ్ ఛాంబర్.. మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే కొత్తగా వచ్చిన ఈ వెబ్‌సైట్‌తో తనకు ఏం సంబంధం లేదని ఐబొమ్మ వెబ్‌సైట్ మాజీ నిర్వాహకుడు రవి తెలపడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/new-pensions-for-widows-from-june-12/
ఐ బొమ్మ, బప్పంలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. కొత్తగా విడుదలవుతున్న చిత్రాలను అక్రమంగా లీక్ చేస్తూ, పైరసీని ప్రోత్సహిస్తున్న ఈ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేసింది. గతంలో ఈ సైట్లను మూసివేయించినప్పటికీ, ఇటీవల సరికొత్త డొమైన్లు, మిర్రర్ లింకులతో ఐ బొమ్మ, బప్పం టీవీలు మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై కొత్త సినిమాలను హెచ్‌డీ క్వాలిటీలో స్ట్రీమింగ్ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, ఐబొమ్మ వెబ్‌సైట్ మాజీ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఈ కొత్త ఐబొమ్మ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరో అపరిచితులు ఐబొమ్మ పేరును దుర్వినియోగం చేస్తూ ఈ అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/national-news/robbery-in-chhattisgarh-congress-office/
ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కొత్తగా కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

