Nenu Ready: యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, హిట్ చిత్రాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘నేను రెడీ’ అనే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం తెరకెక్కుతోంది. సత్యనారాయణ కోనేరు సమర్పణలో, నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హవీష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాటను సైతం చిత్ర బృందం విడుదల చేసింది.
ఘనంగా మెరుపులే- మెరుపులే సాంగ్ లాంచ్: ఈ చిత్రంలోని ‘మెరుపులే మెరుపులే’ అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ సినీ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సాంగ్‌కు సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆకట్టుకునే ట్యూన్, అందమైన విజువల్స్‌కు తోడుగా హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్యాన్ని సాధించే కొత్త అనుభూతులను అందమైన పదాలతో ఆవిష్కరించేలా సాగే ఈ లిరిక్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read-Jana Nayakudu 1st Week Collections: వారం రోజుల్లో ఎంత రికవరీ అయ్యిందంటే..?
అలరిస్తున్న ప్రమోషనల్ కంటెంట్: దర్శకుడు త్రినాధరావు నక్కిన తనదైన ఎంటర్‌టైనింగ్ స్టైల్‌లో హవీష్‌ను అత్యంత సరికొత్త లుక్‌లో ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కామెడీ, రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండనున్నాయి. ఇదిలాఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కొంచెం కొంచెం కొత్తగా’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరాది సంచలన తార నర్గీస్ ఫక్రి నటించి అలరించిన ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ రావడ విశేషం. ఇలా వరుసగా ప్రమోషనల్ అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్న చిత్ర యూనిట్ త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుంది. ఈ కేఎల్ యూనివర్సిటీ వేడుకలో ముఖ్య అతిథిగా దర్శకుడు వి.వి. వినాయక్ పాల్గొనగా.. హీరో హవీష్ కోనేరు, హీరోయిన్ కావ్య థాపర్, దర్శకుడు త్రినాధరావు నక్కిన, నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు, కోనేరు శివకాంచన లత తదితర చిత్రబృందం పాల్గొన్నారు.

