Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. టిక్ టాక్‌లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ , యూట్యూబ్ వీడియోలతో పాప్యులర్ అయిన భార్గవ్ గత కొన్ని రోజులుగా ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకునే క్రమంలోనే కొంతమంది అమ్మాయిలతో భార్గవ్‌కు పరిచయం మొదలైంది. తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక గర్భం దాల్చింది. 2021 ఏప్రిల్ 16న భార్గవ్ మీద కేసు పెడితే ఇన్నాళ్లకి తీర్పు వచ్చింది. అదేంటంటే పోక్సో యాక్ట్ కింద భార్గవ్ మీద నమోదైన కేసులో విశాఖ కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2021న కేసు పెడితే 2025 లో తీర్పు వచ్చింది.
Fun Bucket Bhargav : తెలుగు యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES