Saturday, January 18, 2025
Homeచిత్ర ప్రభGaddar awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డులు

Gaddar awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డులు

నేషనల్ లెవెల్ లో ఉండేలా

ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియట్ లో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి అవార్డులు ఇస్తామని తెలిపారు.

- Advertisement -

జాతీయ స్థాయిలో అవార్డుల సెర్మనీ

జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ, నిబంధనలపై కమిటీ సమావేశం జరిగింది. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలన్నారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు. అవార్డుల పంపిణీ జరగలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

వివిధ విభాగాల్లో

ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేస్తారు.

ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు, ఎండీ డాక్టర్‌ హరీశ్‌, ఈడీ కిషోర్‌బాబు, కమిటీ చైర్మన్‌ బీ నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, హరీశ్‌ శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News